107 వ సినిమా షూటింగ్ లో బాలయ్య.. ఆరోగ్యంపై క్లారిటీ

Balayya in 107th movie shooting Clarity on health,

నందమూరి నటసింహం బాలకృష్ణకు సర్జరీ జరిగిందంటూ.. గత కొన్ని రోజులుగా మోకాలి నొప్పితో బాధపడుతున్నారని సోషల్ మీడియాలో తెగ వార్తలు వైరల్ అవుతున్నాయి. బాలకృష్ణకు మైనర్ సర్జరీనే జరిగిందని, అభిమానులు ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెబుతున్నారని, ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నాకంటూ వార్తలు తెగా వైరల్ అవుతున్నాయి. అలాగే బాలయ్య కాలుకు కట్టు కట్టిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. దీంతో బాలయ్య అభిమానుల్లో ఆందోళనలు మొదలయ్యాయి. అసలేం జరుగుతుందోనంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఈ క్రమంలో ఈ వార్తలపై నందమూరి బాలకృష్ణ స్పందించారు. సోషల్ మీడియాలో తన ఆరోగ్యం గురించి వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. కేవలం రెగ్యులర్ చెకప్ కు వెళ్లానని, దయచేసి అలాంటి అవాస్తవాలు ప్రచురించవద్దని రిక్వెస్ట్ చేశారు. ప్రజంట్ బాలకృష్ణ ఈ రోజు తన 107 వ సినిమా షూటింగ్ లో పాల్గోన్నారు. ప్రజంట్ ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో ఓ ప్రముఖ స్టూడియోలో జరుగుతుంది. రీసెంట్ గా బోయపాటి శ్రీనుతో కలిసి అఖండ సినిమాతో అఖండమైన హిట్ ను అందుకున్న ఈ హీరో వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

గోపిచంద్ మలినేని డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తున్నారు. రీసెంట్ గా సాగిన ఈ షూటింగ్ కు సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి. దీంతో బాలకృష్ణ ఆరోగ్యంపై అభిమానుల్లో క్లారిటీ వచ్చింది. ఇక గోపిచంద్ మలినేని డైరెక్షన్ లో వస్తున్న సినిమాలో బాలయ్య రేంజ్ కు ఏమాత్రం తగ్గకుండా యాక్షన్ సీక్వెన్స్ లు ప్లాన్ చేస్తున్నారు. అలాగే డైరెక్టర్ గోపిచంద్ మార్క్ కూడా ఈ మూవీలో క్లియర్ గా ఉంటుందని సమాచారం. ఈ మూవీలో బాలకృష్ణ కంప్లీట్ యాక్షన్ గా నిలుస్తున్నారు.