బ్రహ్మాస్త్ర నుండి మరో మెలోడీ సాంగ్ రిలీజ్

Another melody song release from Brahmastra,

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, హీరోయిన్ అలియా భట్ కలిసి యాక్ట్ చేస్తున్న లేటెస్ట్ మూవీ బ్రహ్మస్త్ర. అక్కినేని నాగార్జున ఓ కీలక పాత్ర చేస్తున్న ఈ సినిమాను స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్ తో పాటు ప్రైమ్ ఫోకస్, స్టార్ లైట్ పిక్చర్స్ సంస్థలు ఎంతో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఫాంటసీ అడ్వెంచరస్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో అమితాబ్ కూడా ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. వీరితో పాటు మౌని రాయ్, డింపుల్ కపాడియా, సౌరవ్ గుర్జార్, పీర్జాదాలు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ సినిమా ట్రైలర్, టీజర్, పోస్టర్లు ఇప్పటికే రిలీజ్ అయ్యి ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టకుంటుంది. నేడు ఈ సినిమా దేవ దేవ అనే లిరిక్ తో సాగే సాంగ్ ను సోషల్ మీడియాలో ఫిల్మ్ టీమ్ రిలీజ్ చేసింది. ఈ సాంగ్ ను శ్రీరామచంద్ర, అర్జిత్ సింగ్, జోనితా గాంధీ కలిసి సాంగ్ పాడారు. ఈ సాంగ్ కు తెలుగులో చంద్రబోస్ లిరిక్ ను అందించారు. రిలీజ్ చేసిన కొద్ది గంటల్లోనే ఈ సాంగ్ యూట్యూబ్ లో వన్ ఆన్ ట్రెండింగ్ లో నిలిచింది. కాగా బ్రహ్మాస్త్ర సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు పెరిగాయి. కాగా రీసెంట్ గా రిలీజ్ అయిన కుంకుమలా సాంగ్ కూడా మంచి హైప్ వచ్చింది. దీంతో సినిమాపై రణబీర్ కపూర్ పూర్తి నమ్మకంతో ఉన్నారు.

సెప్టెంబర్ 9 న బ్రహ్మాస్త్ర మూవీ పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. కాగా తెలుగులో ఈ సినిమాను రాజమౌళి సమర్పిస్తున్నారు. బ్రహ్మాస్త్ర సినిమాతో రణబీర్ కపూర్ పాన్ ఇండియా హీరో కావాలని ఆశిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన నటిస్తున్న సినిమాలు సౌత్ ఇండియా భాషల్లోనూ రిలీజ్ అవుతున్నాయి.