బాలయ్య సినిమా నుండి అద్దిరిపోయే అప్డేట్?

,Amazing update from Balayya movie

నందమూరి నటసింహం బాలకృష్ణ, గోపిచంద్ మలినేని డైరెక్షన్ లో వస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ NBK 107. ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తున్నారు. ఈ సినిమా బాలకృష్ణ సినీ కెరీర్ లో 107 వ సినిమాగా తెరకెక్కుతుంది. పైగా బాలయ్య మాస్ ఇమేజ్ కు తగ్గట్లు సాలిడ్ స్క్రిప్ట్ ను ఫుల్ హైప్ లో క్రియేట్ చేశారు.

అఖండ సినిమాతో అఖండమైన హిట్ ను అందుకున్న బాలయ్య ఈ సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు. ఈ సినిమాలో మాస్ యాక్షన్ కు గోపిచంద్ మలినేని పెద్ద పీట వేసినట్లు తెలుస్తుంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగా వెయిట్ చేస్తున్నారో.. ఈ సినిమా టైటిల్ కోసం కూడా అంతే ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన బాలయ్య మాస్ టేకింగ్ వీడియోలో బాలయ్య ఫ్యాన్స్ కు మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది.

రీసెంట్ టాక్ ప్రకారం ఈ సినిమా పై ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను రిలీజ్ చేసేందుకు ఫిల్మ్ టీమ్ సన్నాహాలు చేస్తుందట. ఈ నెల రాఖీ పూర్ణిమ స్పెషల్ గా ఈ అప్డేట్ ను అనౌన్స్ చేస్తారని అంటున్నారు. ఈ సినిమాకు సంబంధించిన స్పెషల్ పోస్టర్ గానీ, ఇంట్రెస్టింగ్ అప్డేట్ గాని వస్తుందని అభిమానులు అంచనాలు పెట్టుకున్నారు. అలాగే ఈ సినిమాలో బాలయ్య యాక్షన్ చూసేందుకు అంతే అంచనాలు పెట్టుకున్నారు.

మరి రాఖీ పూర్ణిమకు ఈ మూవీ నుండి ఎలాంటి అప్డేట్ వస్తుందనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో బాలయ్య లుక్ వీర మాస్ లెవెల్ లో ఉండగా, ఈ మూవీలో కూడా బాలయ్య రెండు పాత్రల్లో నటిస్తున్నారట. అయితే ఈ విషయంలో ఎలాంటి క్లారిటీ రాలేదు.