దసరా పండుగకు ఆచార్య నుండి పూజా హెగ్దే లుక్ రిలీజ్

Acharya Movie Pooja Hegde special Poster Released

మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ల కలయికలో వస్తున్న బిగ్గెస్ట్ సినిమా ఆచార్య. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఎంతో వేగంగా జరుగుతున్నాయి. రామ్ చరణ్ కు హీరోయిన్ గా పూజా హెగ్దే నటిస్తున్నారు.

ఈ సినిమాకి మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. నక్సల్స్ బ్యాక్ గ్రౌండ్ తో తెరకెక్కుతున్న ఈసినిమాలో రామ్ చరణ్ సిద్ధ పాత్రలో నటిస్తున్నారు. పూజా హెగ్దే నీలాంబరిగా యాక్ట్ చేస్తుంది. ఈమె పాత్ర కూడా ఎంతో వినూత్నంగా తెరకెక్కుతుంది. దసరా స్పెషల్ తో పాటు పూజా హెగ్దే పుట్టిన రోజు సందర్భంగా ఆచార్య సినిమాలో పూజా లేటెస్ట్ లుక్ ని రిలీజ్ చేసింది ఫిల్మ్ టీమ్.

ఈ పోస్టర్ లో లంగా, ఓణీలో పూజా హెగ్దే ఎంతో అందంగా ఉన్నారు. చూడ్డానికి అచ్చతెలుగు అమ్మాయిలా ఎంతో సంప్రదాయంగా పూజా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ అవుతుంది. దీంతో పూజా క్రేజ్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది. ఈ సినిమాని ఫిబ్రవరి 4 వ తేదీన ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్, సాంగ్ ని రిలీజ్ చేసిన క్రమంలో భారీ రెస్పాన్స్ లభించింది. ఇక ఆచార్య సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు.

Leave a Reply